విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలను మరోసారి సందర్శించనుంది. ఇప్పటికే అందించిన పరిహారం, ఇతర అంశాలపై పరిశీలన చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి వివేక్ యాదవ్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ ఆర్కే మీనా ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ ముగ్గురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు.
గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో హైపవర్ కమిటీ మలివిడత పర్యటన - ఎల్జీ పాలిమర్స్ హైపవర్ కమిటీ
ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ జరుపుతోంది. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలను ఈ కమిటీ మరోసారి సందర్శించనుంది.
![గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో హైపవర్ కమిటీ మలివిడత పర్యటన high power committee visit to LG Polymers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7467593-343-7467593-1591233865561.jpg)
ఎల్జీ పాలీమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ పర్యటన