విశాఖలో ఎల్జీ పాలిమర్స్ హైపవర్ కమిటీ విచారణ రెండో రోజు కొనసాగింది. జీవీఎంసీ సమావేశ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలతో కమిటీ భేటీ అయ్యింది. హైపవర్ కమిటీ విచారణలో 21 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తమకు వైద్య సేవలు అందించాలని..,హెల్త్ కార్డులు ఇచ్చి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని గ్రామస్తులు కమిటీని కోరారు. ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించే వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై హైపవర్ కమిటీ విచారణ - high power committee enquiry on lg polymers gas issue
విశాఖ విషవాయువు దుర్ఘటనపై హైపవర్ కమిటీ రెండో రోజు విచారణ కొనసాగించింది. హైపవర్ కమిటీ విచారణలో ప్రభావిత గ్రామస్తుల తరపున 21 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
హైపవర్ కమిటీ విచారణ
హైపవర్ కమిటీని కలిసేందుకు ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన కనకరాజు భార్య వచ్చారు. ఆమెను పోలీసులు లోపలికి అనుమతించలేదు. గంటకుపైగా గేటు వద్ద వేచి చూసిన ఆమె సొమ్మసిల్లి పడిపోయింది.
Last Updated : Jun 7, 2020, 3:47 PM IST
TAGGED:
high power committee enquiry