విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణను మరో వారం రోజులపాటు వాయిదా వేశారు. మూడు గంటలపాటు ఈ కేసులో వాద ప్రతిపాదనలు వినిపించారు. ఉత్పత్తుల ప్రారంభానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రెండేళ్లుగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేంద్రం పేర్కొంది.
పరిశ్రమలో ప్రమాదకర రసాయనాలు వెలువడి ప్రజలు అనారోగ్యానికి గురైన అంశంపై లోతుగా పరిశీలన జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం నుంచి వైద్యంతో పాటు పరిహారం అందించామని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం పెంచాలని వారి తరఫు న్యాయవాది సీహెచ్ మార్కండేయులు కోరారు. ఇంకా ఏ నివేదిక న్యాయస్థానానికి అందలేదని పేర్కొన్న హైకోర్టు.... ఈ కేసు విచారణను మరో వారానికి వాయిదా వేసింది.