విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 'సొసైటీ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ స్కాలర్షిప్ హోల్డర్స్' అధ్యక్షుడు సువర్ణరాజు వేసిన ఈ పిటిషన్‌పై.. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విశాఖ ఉక్కు సీఎండీ, విశాఖ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఎస్.సురేంద్రకుమార్.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను పాటించే అవకాశం లేకుండా పోతుందన్నారు. దీనివల్ల బలహీన వర్గాలవారు అన్యాయానికి గురవుతారన్నారు. ఇప్పటికే ఈ అంశంపై దాఖలుచేసిన పిల్‌కు ప్రస్తుత వ్యాజ్యాన్ని జత చేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం.. ఇదే అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు - visakha steel plant
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై.. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విశాఖ ఉక్కు సీఎండీ, విశాఖ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ