ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ నియామకాన్ని నిలుపుదల చేసిన హైకోర్టు

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్​గా ఆళ్ల భాగ్యలక్ష్మీ నియామక జీవోను హైకోర్టు నిలుపదల చేసింది. భాగ్యలక్ష్మీ నియామకాన్ని సవాల్ చేస్తూ..దేవి అనే మహిళ హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన ధర్మసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

high court on simhachalam temple
సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్

By

Published : May 11, 2021, 1:05 AM IST

Updated : May 11, 2021, 6:19 AM IST

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్​గా ఆళ్ల భాగ్యలక్ష్మీ నియామక జీవోను సవాల్ చేస్తూ దేవి అనే మహిళ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం ఇచ్చిన జీవోను 8 వారాల పాటు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దేవిని దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్​గా తొలగించడం చట్టవిరుదమని పిటీషనర్ తరఫు న్యాయవాది అయ్యప్ప వాదనలు వినిపించారు.

వీటిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. భాగ్యలక్ష్మిని నియమిస్తూ జారీ చేసిన జీవోను నిలుపదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు దాడి దేవిని ట్రస్ట్ సభ్యురాలిగా కొనసాగవచ్చని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Last Updated : May 11, 2021, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details