సింహాద్రి అప్పన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని.. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ శిల్ప సంపదను, ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు న్యాయమూర్తికి వివరించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు గురించి తెలియజేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో సూర్యకళ తీర్థప్రసాదాలను న్యాయమూర్తి దంపతులకు అందజేశారు.
Simhachalam : సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి - Simhachalam news
సింహాద్రి అప్పన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అప్పన్న దర్శనానంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేశారు.
సింహాద్రి అప్పన్న దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి