రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగ మౌలిక రూపాన్ని పరిరక్షించే విధంగా ఉందని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, న్యాయ విద్యా నిపుణులు ఆచార్య సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఇదొక చరిత్రాత్మక తీర్పని, న్యాయ విద్యార్థులు పరిశీలించాల్సిన అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లకు, స్వతంత్ర ఎన్నికల కమిషన్‌కి అత్యధిక ప్రాధాన్యముందని వివరించారు. రాజ్యాంగం అమలుకు ఒకరోజు ముందుగానే ఓటర్ల దినోత్సవం జరపడం దీనిని నిదర్శమనమన్నారు. ఎన్నికల సంఘంలో కమిషనర్ ఒక్కరు ఉంటేనే నిర్ణయాలు సమగ్రంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం: ఆచార్య సత్యనారాయణ
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమిస్తూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని న్యాయ విద్యా నిపుణులు ఆచార్య సత్యనారాయణ అన్నారు. న్యాయ విద్యార్థులు పరిశీలించాల్సిన అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయని వెల్లడించారు.
professior satyanarayana