ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాద అవగాహన కార్యక్రమంలో సినీహీరో శర్వానంద్ - హీరో శర్వానంద్ విశాఖ

విశాఖలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సినీహీరో శర్వానంద్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు.

hero sarva
రోడ్డు ప్రమాద అవగాహన కార్యక్రమంలో సినీహీరో శర్వానంద్

By

Published : Feb 9, 2021, 10:50 PM IST

ప్రమాదకరంగా వాహనాలు నడిపి విలువైన జీవితాలను కోల్పోవద్దని సినీనటుడు శర్వానంద్ అన్నారు. విశాఖ బీచ్ రోడ్​లో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు. సాధారణంగా జరిగే 100 ప్రమాదాల్లో సుమారుగా 25 ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ఉంటున్నారని ఆయన అన్నారు. దానికి కారణం మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, హెల్మెట్ ధరించకపోవడమేనని శర్వానంద్ చెప్పారు. కొంతమంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్​లు అందజేసి.. వాహనాలను వేగంగా నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ, ఏసీపీలు శ్రవణ్ కుమార్, హర్షిత చంద్ర ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details