విశాఖలో ప్రమాదాల నివారణకు పోలీసులు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలన్న అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. బైక్ నడిపేవారితో పాటు వెనకున్నవారూ శిరస్త్రాణం ధరిస్తే సురక్షితంగా ఉంటారంటూ ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా మద్దిలపాలెం వద్ద వివిధ వర్గాల సహకారంతో.. నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్లు అందించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని కమిషనర్ సూచించారు.
'బైక్ వెనుక కూర్చున్నవారూ హెల్మెట్ పెట్టుకోండి' - విశాఖలో హెల్మెట్ల పంపిణీ
ప్రయాణాలు చేసేటప్పుడు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సూచించారు. విశాఖలో ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణాలు అందజేశారు. బైక్పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే.. ప్రమాదం జరిగినప్పుడు మరణాల శాతం తగ్గుతుందన్నారు.
మహిళకు శిరస్త్రాణం అందజేస్తున్న ఆర్కే మీనా