విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం జలకళను సంతరించుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా నీటి నిల్వలు చేరాయి. ఎగువ ప్రాంతాల నుంచి 17 క్యూసెక్కుల వరద జలాశయంలోకి చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా.. ప్రస్తుతం 133.60 మీటర్లకు చేరింది. నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు సాగునీటికి ఢోకా ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు ప్రాంతం ఖరీఫ్ సాగుకు పనులు జోరందుకున్నాయి.
నిండుకుండలా పెద్దేరు జలాశయం.. రైతుల హర్షం - pedderu project in madugula news
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖలో పెద్దేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 17 క్యూసెక్కుల వరద జలాశయంలోకి చేరింది. నీరు సమృద్ధిగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండలా పెద్దేరు జలాశయం.. రైతుల హర్షం