కూలిన మహా వృక్షం... పడిపోయిన విద్యుత్ స్తంభాలు - కూలిన మహా వృక్షం...పడిపోయిన విద్యుత్ స్తంభాలు !
భారీ వృక్షం కూలటంతో విశాఖ శాంతిపురంలోని గౌతమి గార్డెన్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అధికారులు యుద్ధ ప్రతిపాదికన చెట్లు నరికి, భారీ యంత్రాలను తీసుకుని వచ్చి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు.
![కూలిన మహా వృక్షం... పడిపోయిన విద్యుత్ స్తంభాలు కూలిన మహా వృక్షం...పడిపోయిన విద్యుత్ స్తంభాలు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7384237-728-7384237-1590672498547.jpg)
విశాఖ శాంతిపురంలోని గౌతమి గార్డెన్లో ఏళ్లనాటి ఒక మహా వృక్షం నెలకొరిగింది. భారీ వృక్షం కావడం వల్ల సమీపంలో మరో రెండు వృక్షాలు... చెట్టు విస్తరించిన మేరలో ఉన్న ఐదు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. గౌతమి గార్డెన్ వాసులు... జీవీఎంసి, విద్యుత్ శాఖలకు సమాచారమివ్వగా యుద్ధ ప్రతిపాదికన చెట్లు నరికి, భారీ యంత్రాలను తీసుకుని వచ్చి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. కేవలం మూడు గంటల వ్యవధిలో పునరుద్ధరించి విద్యుత్‌ను సరఫరా చేశారు. హార్టీ కల్చర్ విభాగ అధికారులు ఇళ్లకు ఇబ్బంది రాకుండా చెట్లను నరికించారు.