విశాఖ జిల్లా పాడేరులో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై సిమెంట్ లారీ నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఫలితంగా వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. పాడేరులో రెండు కిలోమీటర్ల మేర ఈ మార్గంలో ఆసుపత్రి, మార్కెట్, సినిమా హాల్, సెంటర్ కాంప్లెక్స్, ఐటీడీఏ ఉండటం వల్ల వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాహనదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు.
ఇవాళ భారీ సిమెంట్ లారీ రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది. ఐటీడీఏ నుంచి పాత బస్టాండ్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ విషయం ఈటీవీలో రావడం, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎస్సై శ్రీనివాస్ రంగంలో దిగారు.
మోక్షం ఎప్పుడో..?