విశాఖలోని ఎన్ఏడీ కొత్త రోడ్డులో ఉన్న మద్యం దుకాణం వద్ద మందుబాబులు గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం తీసుకోవడం స్థానికులకు ఆందోళన కలిగించింది. నగరంలో ఓ వైపు కొవిడ్ వ్యాప్తి తీవ్రం అవుతుంటే మరోవైపు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు మందుబాబులు. వీరిలో చాలామంది మాస్కులు ధరించడం లేదు.
ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం అమలయ్యేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అటువంటి నిబంధనలు బేఖాతరు చేస్తూ.. ఇష్టారాజ్యంగా మందు బాబులు ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.