అనకాపల్లిలో జనం రద్దీ... కరోనాను లెక్కచేయని ప్రజలు - corona news in anakapalli
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజల్లో మాత్రం ఆ భయం ఎక్కడా కనిపించడం లేదు. ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అనకాపల్లిలో దుకాణాలన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. కొంతమంది భౌతికదూరం మరిచి కొనుగొళ్లు చేస్తున్నారు
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒక పక్క కరోనా కేసులు పెరుగుతున్నా జనాల్లో సామాజిక స్పృహ కొరవడుతోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా వ్యాపార కేంద్రం అనకాపల్లిలో దుకాణాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. వీరిలో కొంతమంది మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటిస్తుండగా... మరికొంత మంది భౌతిక దూరం పాటించడం లేదు. దీనివల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. జ్యూవలరీ, వస్త్ర, కిరాణా దుకాణాలలో పాటు పండ్లు, పూల వ్యాపారం జోరుగా సాగుతోంది. దుకాణాల వద్ద చాలామంది కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.