విశాఖ జిల్లాలో వర్షం కారణంగా... ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చాలాచోట్ల పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. పాయకరావుపేట తాండవ నదిలో వరద నీరు పెరుగుతోంది. కాలువలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. నదిలో నీటిమట్టం పెరగటంతో... ముంపు బారిన పడకుండా పలు గ్రామాలను ముందస్తుగా ఖాళీ చేయించారు. విశాఖ, విజయనగరం సరిహద్దు గ్రామాలు వర్షాలతో వణికిపోతున్నాయి. రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్ వినయ్‌చంద్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... వరద గుప్పిట్లో విశాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా... ఉత్తరాంధ్రలో రెండ్రోజులు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటుదని అధికారులు చెప్పటంతో... గ్రామీణప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ వానలకు విశాఖ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విశాఖను ముంచెత్తున్న వరద ప్రవాహం