విశాఖ మన్యంలో వారం నుంచి కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల పరిధిలో వందల ఎకరాల్లో వరి నీట మునిగింది. చాలా భూముల్లో ఇసుక మేటలు వేశాయి. అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మత్స్యగెడ్డ, చాపరాయ గెడ్డ, కొత్తవలస తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాలకు నీట మునిగిన పంటలు.. పొంగిపొర్లుతున్న వాగులు - విశాఖ మన్యంలో భారీ వర్షాలు
విశాఖ మన్యంలో వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రైతులు భారీగా నష్టపోయారు. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.
భారీ వర్షాలు