ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో భారీ వర్షాలు.. పొంగుతున్న నదులు, వాగులు

విశాఖ జిల్లా మాడుగులలో నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువన వరద నీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తుండటం వల్ల జళకళ సంతరించుకుంది.

విశాఖలో భారీ వర్షాలు.. పొంగుతున్న నదులు, వాగులు
విశాఖలో భారీ వర్షాలు.. పొంగుతున్న నదులు, వాగులు

By

Published : Oct 11, 2020, 7:09 PM IST

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దిగువకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లోని నదులు, గెడ్డలు వరదనీటితో నిండుగా ప్రవహిస్తున్నాయి.

కోనాం జలాశయం..

చీడికాడ మండలంలోని కోనాం జలాశయం గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా బొడ్డేరు నది జలాశయం నుంచి విడుదలైన నీరు, గెడ్డల నుంచి వచ్చే నీటికి తోడు కావడం వల్ల నది ఉద్ధృతంగా పొంగుతోంది.

పెద్దేరు ప్రాజెక్ట్..

మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి వరద నీరు విడుదల చేయడంతో దిగువ పెద్దేరు నది వరద నీటితో జోరుగా ప్రవహిస్తోంది.

విశాఖలో భారీ వర్షాలు.. పొంగుతున్న నదులు, వాగులు

రైవాడ డ్యాం..

దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి వరద నీటి విడుదలతో దిగువన శారదా నదిలో వరద నీరు భారీగా పొంగుతోంది. వరదనీటి పరవళ్లును సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇవీ చూడండి : 'ఎస్సీ ఓట్లతో పీఠమెక్కి... వారిపైనే యుద్ధమా?'

ABOUT THE AUTHOR

...view details