వానల ధాటికి గెడ్డలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఏలేరు కాల్వ వరద ప్రవాహంతో కొప్పాక జాతీయ రహదారి నీట మునిగింది. శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనకాపల్లిలోని భీముని గుమ్మం ఉన్నత పాఠశాల ప్రహరీ గోడపై చెట్టు కూలింది. నూకాంబిక ఆర్చ్ వద్ద నీరు నిలిచిపోయింది. రైవాడ, తాండవ, కళ్యాణలోవ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కళ్యాణపులోవ జలాశయం రెండుగేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకి వదులుతున్నారు. తాండవ ప్రాజెక్టు రెండుగేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రైవాడ జలాశయం ఒక గేటు ఎత్తారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో...