విశాఖపట్నంలో సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం కురవడం వల్ల ఉద్యోగులు, నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తా ప్రాంతంలో వర్ష ప్రభావం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ నిపుణులు తెలిపారు.
విశాఖలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - విశాఖపట్నం వాతావరణం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.
విశాఖలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం