విశాఖ పాడేరు మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా పడుతున్న వానలకు పంట పొలాలు నీటితో కళకళలాడుతోంది. రైతులు వరి నాట్లు వేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. ఏ పొలాల్లో చూసినా గిరిజన మహిళా రైతులు సాగు పనుల్లోనే కనిపిస్తున్నారు. వర్షాలకు గడ్డలు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. హుకుంపేట మండలం సన్యాసమ్మ పాలెంలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు చలాకీగా వ్యవసాయ పనులు చేస్తూ...అబ్బురపరుస్తోంది.
విస్తారంగా వర్షాలు... పొలం పనుల్లో మన్యం రైతులు
వర్షాధార సాగుపై ఆధారపడిన మన్యం వాసులకు... నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఓ పక్కన వర్షం కురుస్తున్నప్పటికీ గొడుగులు ధరించి పొలాల్లో పనులు చేస్తున్నారు.
విస్తారంగా వర్షాలు... పనుల్లో నిమగ్నమైన రైతన్నలు