శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ వర్షం పడింది. ఉరుముల శబ్దాలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.16వ నెంబరు జాతీయ రహదారి అస్తవ్యస్తంగా మారింది. నిర్మాణ దశలో ఉన్న రహదారిపై ఐదు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవంక నిర్మాణ దశలో ఉన్న కొత్త రహదారి మార్గం కూడా కోతకు గురైంది.
శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షం - heavy rain vishaka district anakapalli
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట, విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములకు ప్రజలు భయందోళనకు గురయ్యారు.

శ్రీకాకుళం,విశాఖ జిల్లాలో భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ వర్షం
విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రమయ్యే సరికి వర్షం పడటంతో ఉపశమనం పొందారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో భారీ వర్షం
ఇవీ చదవండి