విశాఖ జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. అనకాపల్లి, చోడవరంలో వర్షం కురిసింది. ఎండవేడితో ఉక్కపోతకు గురై ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. గత వారం రోజులుగా భానుడి ప్రతాపంతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. ఉరుములు, మెరుపులతోపాటు రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. పలు రహదారులు జలమయమయ్యాయి.
విశాఖలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం
విశాఖ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఎండవేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది.
heavy rain in vishaka in ap