ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యంలో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ముంచంగిపుట్టు మండలం జి.సిరగం పుట్టు వద్ద వరద ఉద్ధృతికి నీరు మొత్తం రహదారి మీద నుంచి ప్రవహిస్తొంది. ఫలితంగా.. రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.