ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం.. విరిగిపడిన చెట్లు

విశాఖ జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చెట్లు విరిగి కిందపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

heavy rain in visakha dst trees damaged and power problems arise
heavy rain in visakha dst trees damaged and power problems arise

By

Published : Jul 1, 2020, 3:47 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట రావికమతం మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలపై విరిగిన చెట్ల కొమ్మలు పడటంతో రోలుగుంట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా రోలుగుంట, కొవ్వూరు, కొత్తకోట, కొమరవోలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాడుగుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.

ABOUT THE AUTHOR

...view details