విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో ఖరీఫ్ రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, రావికమతం, రోలుగుంట తదితర మండలాల్లో రాత్రి పది గంటల వరకు విస్తారంగా భారీ వర్షం కురవటంతో రహదారులు జలమయమయ్యాయి. సాగునీటి వనరులు సమృద్ధిగా నీరు చేరింది. అన్నదాతలు అంతా నారు తీయటం, నాట్లు వేయటం, దమ్ములు పెట్టటం తదితర పనుల్లో నిమగ్నమయ్యారు.
నర్సీపట్నంలో భారీ వర్షం..వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు - విశాఖలో వర్షం
విశాఖ జిల్లా నర్సీపట్నంలో కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. నాట్లువేయటం,నారు తీయటంలో నిమగ్నమయ్యారు.
heavy rain in visakha dst narisipatnam