తెగిన వంతెన... ఆగిన రవాణా - heavy rain in padearu
విశాఖ మన్యంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం దాటికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చాలా చోట్ల పంటలు నీట మునిగాయి.
![తెగిన వంతెన... ఆగిన రవాణా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4363222-1011-4363222-1567818212161.jpg)
పాడేరులో భారీ వర్షం..పొంగిన వాగులు
పాడేరు మన్యంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం దాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జి. మాడుగుల మండలం సూరిమెట్ట వద్ద బ్రిడ్జి కొట్టుకుపోయింది. మద్దిగురువు చాపగడ్డ వద్ద జియో కేబుల్ కట్ అయిపోయి పరిసరాల్లో సెల్ ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల పొలాలు నీట మునిగాయి. నష్టం ఎన్ని ఎకరాల్లో ఉందనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
పాడేరులో భారీ వర్షం..పొంగిన వాగులు