విశాఖ మన్యం కేంద్రమైన పాడేరులో సుమారు గంటసేపు భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలో మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఎన్నికలు కావడం.. చివరి నిమిషంలో వర్షం కురవడం వల్ల ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. వర్షం వల్ల కలిగిన ఆటంకాలతో మారుమూల ప్రాంతాల నుంచి పాడేరు చేరుకునే వారు సతమతమయ్యారు. అనేక చోట్ల రహదారి పక్కన వర్షం నీరు కాలువలా ప్రవహించింది. మధ్యలో వడగళ్ల వాన సైతం పడింది. చాలా కాలంగా తరువాత పడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
పాాడేరులో భారీ వర్షం... ఓటర్లకు అనుకోని కష్టం - visaka district news
విశాఖ మన్యంలోని పాడేరులో కురిసిన భారీ వర్షంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మారుమూల ప్రాంతాలనుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు అవస్థలు పడ్డారు.
పాాడేరులో భారీ వర్షం... ఇబ్బంది పడ్డ ఓటర్లు