విశాఖ మన్యం పాడేరులో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం 2 గంటల పాటు అక్కడి వారిని ఆందోళనకు గురి చేసింది. స్థానిక ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో విద్యుత్ తీగలపై భారీ వృక్షం కూలిపోయి.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుకుంపేటలో వడగళ్ల వాన పడింది.
మన్యంలో భారీ వర్షం... ఆందోళనలో గిరిజనం.. - latest news on rain at paderu
ఓ వైపు లాక్డౌన్, మరోవైపు భారీ వర్షాలు మన్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. పాడేరులో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పెద్ద పెద్ద చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
![మన్యంలో భారీ వర్షం... ఆందోళనలో గిరిజనం.. heavy rain at paderu in visakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6846217-534-6846217-1587231578410.jpg)
మన్యంలో వర్షానికి నెలకొరిగిన చెట్లు