విశాఖ గోపాలపట్నంలోని కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలైన లక్ష్మీ నగర్, ఇందిరా నగర్లలో మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. కనీసం భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా ఎగబడుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నాలుగు గంటల వరకు... తక్కువ ధర ఉన్న మద్యాన్ని అమ్ముతున్నందున రద్దీ నెలకొంటోంది. ఈ ప్రాంతాల్లో గత నాలుగు రోజుల్లో సుమారు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
విమర్శలకు స్పందన..