ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పోలీసుల దాడులు.. భారీగా గంజాయి పట్టివేత - marijuana seized in kurnool district

రాష్ట్రంలో పలు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారీగా మద్యాన్ని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు.

heavy marijuana seized in ap
రాష్ట్రంలో పోలీసుల దాడులు.. భారీగా గంజాయి పట్టివేత

By

Published : Mar 6, 2021, 11:00 PM IST

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలీసులు వివిధ జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు వాహనాల తనిఖీల నిర్వహించారు. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న రెండు తెలంగాణ ఆర్టీసీ బస్సులలో 16.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు.

విశాఖ జిల్లా

విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు కూడలిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. గంజాయి పట్టుబడింది. 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు.

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పోలీసుల తనిఖీలో 6 కేజీల గంజాయి పట్టుకున్నారు. 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి 4 వాహనాలు అదుపులోకి తీసుకున్నారు

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా సి. రంగాపురం గ్రామం క్రాస్ వద్ద చంద్రశేఖర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో 90 కర్ణాటక మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పోలీసులకు పట్టుకున్నారు.

ఇదీ చదవండి

విశాఖ: కొత్తపల్లికి చెందిన గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

ABOUT THE AUTHOR

...view details