పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీరం వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతోన్న అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులోఆవర్తనం ఆవరించి ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండడం వల్ల... మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
హెచ్చరిక: మరింత బలపడనున్న అల్పపీడనం - latest news on low pressure
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం
TAGGED:
latest news on low pressure