విశాఖ జిల్లా అనకాపల్లిలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి శారదా నది జలకళ సంతరించుకుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో పాటు అనకాపల్లిలో భారీగా కురుస్తున్న వర్షాలకు శారదా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ప్రవాహాన్ని అనకాపల్లి పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
జలకళ సంతరించుకున్న శారదా నది - విశాఖ జిల్లాపై వర్షాల ప్రభావం
విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు శారదా నది జలకళ సంతరించుకుంది.
జలకళ సంతరించుకున్న శారదా నది