ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనాం జలాశయానికి వరద.. దిగువకు నీటి విడుదల - Konam Middle Range Dam news today

విశాఖ జిల్లా కోనాం జలాశయం నుంచి దిగువకు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి పెద్ద ఎత్తున వరద చేరుతోంది.

కోనాం జలాశయం నుంచి భారీగా వరద నీరు విడుదల
కోనాం జలాశయం నుంచి భారీగా వరద నీరు విడుదల

By

Published : Oct 11, 2020, 7:59 PM IST

విశాఖ జిల్లా కోనాం మధ్యతరహా జలాశయం నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని నదిలోకి విడిచి పెడుతున్నారు.

పూర్థిస్థాయిలో నీటిమట్టం..

విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట స్థాయి నీటి మట్టం 101.25 మీటర్లు కాగా, నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 2,250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

బొడ్డేరులోకి..

అప్రమత్తమైన అధికారులు 2,250 క్యూసెక్కుల వరద నీటిని గేట్లు ఎత్తి బొడ్డేరు నదిలోకి వదులుతున్నారు. ఫలితంగా బొడ్డేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఇవీ చూడండి:

'ఎస్సీ ఓట్లతో పీఠమెక్కి... వారిపైనే యుద్ధమా?'

ABOUT THE AUTHOR

...view details