విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్య తరహా జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి 485 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరింది.
పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 100.80కి చేరుకుంది. అధికారులు దిగువకు 240 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు నదిలోకి దిగొద్దని హెచ్చరించారు.