ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా...విస్మరిస్తున్న భౌతికదూరం! - విశాఖ జిల్లా ప్రధాన వార్తలు

విశాఖ జిల్లా దేవరాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. అయినప్పటికీ లాక్​డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలు భౌతికదూరం విస్మరిస్తున్నారు.

బ్యాంకు వద్ద గుమ్మిగూడిన జనం
బ్యాంకు వద్ద గుమ్మిగూడిన జనం

By

Published : May 18, 2021, 9:26 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. కూరగాయల మార్కెట్, బ్యాంకులు, కిరాణా, ఇతర దుకాణాల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఏ ఒక్కరూ భౌతిక దూరం పాటించడం లేదు. మార్కెట్​లో కొనుగోలు కేంద్రాల వద్ద ఒకరిపై ఒకరు పడుతూ మరీ కొనుగోలు చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజలకు కొవిడ్​పై అవగాహన కల్పించి, చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details