ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రపంచ మధుమేహ దినోత్సవం : ఆరోగ్య సూత్రలు పాటిస్తే సరి - ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్తలు

మధుమేహం.. వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి. కరోనా వేళ దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యల వారికి ముప్పు ఎక్కువగా పొంచి ఉందని చెప్పే క్రమంలో వైద్య సమాజం ప్రత్యేకంగా గుర్తు చేసింది చక్కెర వ్యాధినే. ఒకసారి ఈ వ్యాధి వస్తే జీవితాంతం భరించాల్సిందే అన్న చేదు వాస్తవం చాటునే చక్కని పరిష్కారం సైతం ఉంది. మెరుగైన జీవనం, క్రమబద్ధమైన ఆరోగ్య సూత్రాలను పాటిస్తే.. జీవితాన్ని ఆరోగ్యమయంగా మార్చుకోవచ్చనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం మీ కోసం.

ప్రపంచ మధుమేహ దినోత్సవం : ఆరోగ్య సూత్రలు పాటిస్తే సరి
ప్రపంచ మధుమేహ దినోత్సవం : ఆరోగ్య సూత్రలు పాటిస్తే సరి

By

Published : Nov 14, 2020, 10:56 PM IST

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. కానీ, కొన్నిసార్లు అనారోగ్యం చుట్టు ముట్టినా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మహభాగ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చక్కెర వ్యాధి గ్రస్తులకు ఈ సూత్రం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యగా గత నాలుగైదు దశాబ్దాల్లో మధుమేహం వ్యాప్తి చెందిన తీవ్రత ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

క్రమంగా పెరుగుతోన్న సంఖ్య..

ఏటా పెరిగిపోతున్న మధుమేహ వ్యాధి బాధితుల సంఖ్య పట్ల ప్రజల్లో అవగాహన, అప్రమత్తత పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మందికిపైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

4 రెట్లు పెరిగింది..

ప్రపంచ జనాభాలో 6 శాతం మంది వరకు చక్కెర వ్యాధి బారిన పడినట్లు అంచనాలున్నాయి. 1980వ దశకం నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఈ పరిణామాల్ని గమనిస్తే చక్కెర వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం ఈ వ్యాధితో పోరాడుతున్న వారు అలవరుచుకోవాల్సిన జీవన శైలి ప్రాధాన్యతలు ప్రతి ఒక్కరికీ అర్థం అవుతాయని ప్రముఖ డాక్టర్ వెంపటి రామనర్సింహం తెలిపారు.

అవగాహన కొరవడింది..

మధుమేహంతో బాధ పడుతున్న వారిలో ప్రధానంగా అవగాహన కొరవడినట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఇద్దరి చక్కెర వ్యాధి బాధితుల్లో ఒకరికి తమ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియడం లేదు.

నియంత్రణలో ఉంచాలి..

కేవలం 24 శాతం మంది మాత్రమే చక్కెర మధుమేహ ప్రభావాన్ని నియంత్రణలో ఉంచుతున్నారు. ఎక్కువగా దిగువ, మధ్య తరగతి ప్రజలు ఈ వ్యాధిని ఎదుర్కొంటుండటం ఈ పరిస్థితికి కారణమని భారత ప్రజారోగ్య సంస్థ, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనలో తేలింది. కాస్త తెలుసుకోవాలన్న ఆలోచన, పాటించాలన్న పట్టుదల ఉంటే వ్యాధి ప్రభావాన్ని కచ్చితంగా అదుపులో ఉంచడం సాధ్యమని మధుమేహ వైద్య నిపుణురాలు డాక్టర్. కావ్యాచంద్ స్పష్టం చేశారు.

క్రమం తప్పని వ్యాయమం..

మంచి ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, కచ్చిత వైద్య పరీక్షలు.. ఈ మూడు జాగ్రత్తలను జీవన విధానంలో తప్పని సరిగా భాగం చేసుకుంటే, ప్రశాంతమయ, ఆరోగ్యమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి : రహదారులు అధ్వానం.. ప్రయాణంలో ఒళ్లు హూనం

ABOUT THE AUTHOR

...view details