Vidadala Rajini Video Conference: రాష్ట్రానికి అత్యవసరంగా కొవిడ్ టీకాలు పంపాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి చర్యలపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 47వేల కొవిడ్ టీకాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని.. రెండు మూడ్రోజుల్లో అవీ అయిపోతాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌లు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతున్నట్లు వివరించారు.
వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌లు పంపించండి.. కేంద్రాన్ని కోరిన విడదల రజని - కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ
Vidadala Rajini Video Conference: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కరోనా కట్టడి చర్యలపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయాతో వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రానికి వ్యాక్సిన్‌లు పంపించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి విడదల రజని