ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూర్చున్న చోటే మహిళ ప్రసవం.. మంత్రి ఆరా - సింహాచల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఓ మహిళ ప్రసవం తాజా వార్తలు

కూర్చున్న చోటే ఓ మహిళ ప్రసవించడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఈ మేరకు బాధితురాలికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

కూర్చున్న చోటే ప్రసవం.. మంత్రి ఆరా.. మెరుగైన వైద్యసేవలకు ఆదేశం
కూర్చున్న చోటే ప్రసవం.. మంత్రి ఆరా.. మెరుగైన వైద్యసేవలకు ఆదేశం

By

Published : May 14, 2021, 9:52 AM IST

విశాఖపట్నం జిల్లా పరిధిలోని సింహాచల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఓ మహిళ ప్రసవించటంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. అడవివరం గ్రామీణ వైద్య కేంద్రం వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ రోడ్డుపై ప్రసవించినట్టు మీడియాలో వచ్చిన కథనంపై స్పందించారు.

ఫోన్​ ద్వారా ఆరా..

క్షేత్రస్థాయి సమాచారాన్ని ఫోన్ ద్వారా విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్​. సూర్య నారాయణను అడిగి తెలుసుకున్నారు. కూర్చున్న చోటే గర్భిణీ ప్రసవించినట్లు తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నొప్పులతో బాధపడుతున్న లక్ష్మి.. కూర్చున్న ఉన్న చోటే ప్రసవించారు.

ఇవీ చూడండి :

ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి

ABOUT THE AUTHOR

...view details