విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ఆరోగ్య రక్ష పేరిట పాత్రికేయులకు హెల్త్ కార్డులను అందజేశారు. హెల్త్ కార్డు ద్వారా తన ఆసుపత్రిలో పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులకు అన్నిరకాల రోగాలకు ఓపీ సేవలు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఆరోగ్యపరమైన సలహాలు అందిస్తామని, పాత్రికేయులకు తన వంతుగా ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. కరోనా సమయంలో ప్రజలను చైతన్యవంతులను చేసేలా పాత్రికేయులు చూపిన చొరవను కొనియాడారు.
అనకాపల్లిలో పాత్రికేయులకు హెల్త్ కార్డుల పంపిణీ - విశాఖలో పాత్రికేయులకు హెల్త్ కార్డుల పంపిణీ
విశాఖ జిల్లా అనకాపల్లిలో భాజపా ఆధ్వర్యంలో... పాత్రికేయులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. పాత్రికేయులకు తన వంతుగా ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణ తెలిపారు.
అనకాపల్లిలో పాత్రికేయులకు హెల్త్ కార్డులు పంపిణీ