కొవిడ్ వారియర్స్‌కు ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, వెల్ బీయింగ్ పరీక్షలు చేయనున్నట్టు మానసిక శాస్త్రం (సైకాలజీ) విభాగ అధిపతి ఆచార్య ఎంవిఆర్ రాజు తెలిపారు. ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 26 నుంచి 28 వరకు 'సైకోమెట్రిక్ ఎక్స్ పో' నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తొలిరోజు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి, రెండో రోజు పోలీసులకు, మూడోరోజు పలురకాల కొవిడ్ వారియర్లకు, పాత్రికేయులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఈ నెలాఖరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మానసిక పరీక్షలు - మానసిక శాస్త్రం (సైకాలజీ) విభాగ అధిపతి ఆచార్య ఎంవిఆర్ రాజు మీడియా సమావేశం వార్తలు
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సేవలందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మానసిక పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆంధ్ర విశ్వవిద్యాలయం మానసిక శాస్త్రం (సైకాలజీ) విభాగ అధిపతి ఆచార్య ఎంవిఆర్ రాజు తెలిపారు. ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 26 నుంచి 28 వరకు 'సైకోమెట్రిక్ ఎక్స్ పో' నిర్వహిస్తున్నామన్నారు.
![ఈ నెలాఖరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మానసిక పరీక్షలు Head of the Department of Psychology Acharya MVR Raju press meet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10759310-320-10759310-1614165162822.jpg)
మానసిక శాస్త్రం విభాగ అధిపతి ఆచార్య ఎంవిఆర్ రాజు
మానసిక సమస్యలు కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ సునీత, సుభాషిని, పవన్, అంజన, ఆచార్య పాల్, పరిశోధకుడు దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...
ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం..
TAGGED:
psychometric_expo