ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మ ఒడి నగదు అడిగినందుకు.. విద్యార్థికి చెంపదెబ్బల శిక్ష! - amma vodi scheme latest news

అమ్మఒడి నగదు రాలేదని అడిగిన విద్యార్థిపై.. దాడికి దిగాడో ప్రధానోపాధ్యాయుడు. నువ్వు హీరో అయిపోయావా... నాకు ఎదురు సమాధానం చెప్తావా అంటూ విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్​గా మారింది.

head master beats student for asking amma vodi money
అమ్మఒడి నగదు అడిగినందుకు విద్యార్థిని కొట్టిన ప్రధానోపాధ్యాయుడు

By

Published : Feb 4, 2021, 7:57 AM IST

అమ్మఒడి నగదు అడిగినందుకు విద్యార్థిని కొట్టిన ప్రధానోపాధ్యాయుడు

"నువ్వు ఎవరిని అడగాలి.. డబ్బులు ఎవరిని అడగాలి... మీ నాన్నకు చెప్పు.. ఇక్కడకు రావటానకి వీలులేదని... ఏంటి హీరో అయిపోయావా నువ్వు?".. అంటూ విద్యార్థిపై చేయి చేసుకున్నాడో ప్రధానోపాధ్యాయుడు.

అసలు ఏం జరిగిందంటే..

విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగు తుని గ్రామానికి చెందిన.. రూపేష్ గ్రామంలోనే ఎనిమిదో తరగతి వరకు చదివాడు. తొమ్మిదో తరగతి నర్సింగబిల్లిలో చదువుతున్నాడు. 8, 9 వ తరగతికి సంబంధించిన అమ్మఒడి నగదు పడలేదు. ఏనుగు తుని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మని అడగ్గా.. ఆయన వీరావేశంతో విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం చదువుతున్న పాఠశాల మేడమ్​ని అడగకుండా తనను ఎందుకు అడుగుతున్నావని విద్యార్థి చెంప ఛెళ్లుమనిపించారు. అతని తండ్రిని తన వద్దకు రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అయితే.. తాను చెప్తే ఆయన వినరనీ, మీరే చెప్పండి అని.. ఆ విద్యార్థి చెబుతున్నా ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోలేదు. ఓ దశలో మెడ పట్టుకుని మరీ చెంపలు వాయించారు. ఈ దృశ్యాలు.. వైరల్ అయ్యాయి.

ప్రధానోపధ్యాయుడి వివరణ ఏంటంటే...

ఘటనపై ప్రధానోపాధ్యాయుడు శర్మను వివరణ కోరగా.. "విద్యార్థి రూపేష్, అతని అన్నయ్యకి వేర్వేరు బ్యాంకు అకౌంట్ ఖాతాలు ఇవ్వడం వల్లే నగదు పడలేదు" అని వివరణ ఇచ్చారు. ఒకే బ్యాంకు అకౌంట్ ఇవ్వాలని విద్యార్థి తండ్రి దుర్గారావుకు చెప్పామన్నారు. "దుర్గారావు మద్యం సేవించి వచ్చాడు. నా వల్లే అమ్మఒడి నగదు రాలేదని దురుసుగా మాట్లాడాడు. అంతే కాదు... విద్యార్థి రూపేష్ సైతం అమర్యాదగా మాట్లాడాడు. అందుకే మందలించాల్సి వచ్చింది" అని ప్రధానోపాధ్యాయుడు చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:

నాడు-నేడు.. నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details