ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో జోరువాన.. ప్రజలకు కాస్త ఉపశమనం - వాన తాజా వార్తలు

విశాఖ జిల్లాలో ఎలమంచిలి నియోజకవర్గంలో ఈ ఉదయం నుంచి వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లపై నీరు చేరింది. సింహాచలం కొండపై కూడా భారీ వర్షం పడింది. ఎండలతో అల్లాడిన ప్రజలు వర్షం కురవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

havey rains in visakhapatnam
విశాఖలో వాన

By

Published : Jun 23, 2021, 2:01 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోవడంతో ఆహ్లదకర వాతావరణం ఏర్పడింది. గత రెండు రోజులుగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉమశమనం పొందారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లపై నీరు చేరింది. అల్పపీడనం కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది.

సింహాచలంలో..

సింహాచలం కొండపై వర్షం కురిసింది. వర్షం కురవడంతో సింహగిరి ప్రాంతమంతా అందంగా దర్శనమిచ్చింది. ఆలయం చుట్టూ మేఘాలు కమ్ముకోవడంతో స్వామివారి గాలిగోపురం భక్తులను ఆకట్టుకుంది. సింహగిరిపై స్వామివారి నిత్య కళ్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు స్వామివారికి అన్నప్రసాదం చేశారు.

ABOUT THE AUTHOR

...view details