ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడికాడలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం - చీడికాడలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

సాగునీటి సంఘాలను ప్రభుత్వం రద్దు చేయడంపై విశాఖ జిల్లా చీడికాడలో వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

చీడికాడలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
చీడికాడలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Aug 4, 2020, 7:43 PM IST



విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముత్యాలనాయుడు చిత్రపటాలకు వైకాపా నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో సాగునీటి సంఘాలను రద్దు చేయటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వై.బి పురం, తునివలస వైకాపా నేతలు, మాజీ సర్పంచులు రాజబాబు, అప్పలనాయుడు మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల రద్దుతో రైతులకు విముక్తి లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పీఏసీఎస్ పాలకవర్గాల పదవీ కాలం పొడిగింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details