ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హాథ్రస్ ఘటనను అత్యాచారం, హత్య కేసుగా దర్యాప్తు జరపాలి'

హాథ్రస్ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్రంలోని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని అమలు పరచాలన్నారు. విశాఖ వేదికగా ప్రెస్ క్లబ్​లో మహిళా సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.

'Hathras incident
హాథ్రస్ ఘటనను

By

Published : Oct 29, 2020, 5:54 PM IST

ఉత్తరప్రదేశ్ లో హాథ్రస్ ఘటనకు బాధ్యులైన వారిని అత్యాచారం, హత్య కేసు కింద దర్యాప్తు జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి కోరారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని అమలు పరచాలన్నారు. అత్యాచార విషయాన్ని బయటపెట్టిన వైద్యులపై కక్ష సాధింపు చర్యలు దారుణమన్నారు.

వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని బెదిరించిన జిల్లా పాలనాధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించి జీవనోపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

పడవ మునిగిన ఘటనలో ముగ్గురి మృతదేహాలు వెలికితీత

ABOUT THE AUTHOR

...view details