భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడువిశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ఆయన విశాఖలోని కంచరపాలెంలో రోడ్ షో నిర్వహిస్తారు. అమిత్ షాతో పాటు ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న భాజపా...దేశంలో సుస్థిర పాలన తేవాలనే నినాదంతో ప్రచారం చేస్తోందని..ఆ పార్టీ సీనియర్ నేత విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. దేశంలో మళ్లీ మోదీ రావటం ఖాయమని ఆయన చెప్పారు.
'నేడు విశాఖకు అమిత్ షా' - విశాఖపట్నం
విశాఖలో ఈ రోజు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు.
!['నేడు విశాఖకు అమిత్ షా'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2896786-241-49a25176-63cc-442d-a6e0-c562e1c23d5b.jpg)
నేడు విశాఖకు అమిత్ షా