విశాఖలోని ఓ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. 15 నెలల కిందట ఆమె భర్త మృతి చెందాడు. దీనిని ఆసరాగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లా దివిలికి చెందిన ఆకుల అచ్యుత్‌కుమార్ అనే మేస్త్రీ ఆమెను ప్రేమిస్తున్నాను..పెళ్లిచేసుకుంటానని నమ్మబలికాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఫోటోలు చిత్రీకరించి.. 250 మంది ఉపాధ్యాయులు ఉండే వాట్సప్, ఫేస్బుక్ సామాజిక గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఉపాధ్యాయురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులూ మానసికంగా వేధించడంతో చివరకు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ ఉద్యోగుల సంఘం పోలీసులకు సాక్ష్యాలను చూపించారు. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు కలిగి ఉండి ఏదో ఆసరా కోసం పెళ్లి చేసుకుందామనుకుంటే... ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే మహిళలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు అన్నారు. ఇప్పటికైనా బాధితురాలికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
మహిళపై వేధింపులు... సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు - సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు
ఓ మహిళా టీచర్ని ప్రేమిస్తున్నాను..పెళ్లి చేసుకుంటానని ఓ ప్రబుద్ధుడు అని నమ్మించాడు. ఆమెకి సంబంధించిన అసభ్యకర చిత్రాలను ఓ సామాజిక గ్రూపులో పంపించాడు. విషయం తెలుసుకున్న టీచర్ ఆత్మహత్యకు ప్రయత్నించగా... తోటి ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విశాఖలో జరిగింది.
మీడియాతో మాట్లాడుతున్న బాధితురాలు