ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధక విభాగ పధిపతి తనని వేధిస్తున్నాడని ఓ విద్యార్థిని రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసింది. డబ్బులు డిమాండ్ చేస్తూ..మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదు లేఖలో పేర్కొంది. తను రాసి ఇచ్చిన పరిశోధన ముసాయిదాను పలుమార్లు తిరస్కరించారని తెలిపింది. డబ్బులు ఇస్తేనే అనుమతిస్తానని బెదిరించినట్లు లేఖలో వివరించింది. హాజరు పట్టీలో సంతకం కూడా చేయనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థిని ఆరోపణలతో రిజిస్ట్రార్ కృష్ణమోహన్ స్పందించారు. సదరు ప్రొఫెసర్‌పై విచారణకు ఆదేశించారు.
ఏయూలో విద్యార్థినికి వేధింపులు.. ప్రొఫెసర్‌పై విచారణ - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థినికి వేధింపులు
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పరిశోధక విభాగ అధిపతి తనని వేధిస్తున్నాడని ఓ విద్యార్థిని రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణకు రిజిస్ట్రార్ కృష్ణమోహన్ అధికారులను ఆదేశించారు.
![ఏయూలో విద్యార్థినికి వేధింపులు.. ప్రొఫెసర్‌పై విచారణ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థినికి వేధింపులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5250739-thumbnail-3x2-au.jpg)
harassment-of-student-at-andhra-university