ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయకరావుపేటలో చేనేత కార్మికుల ధర్నా - handloom workers protest in payakaraopeta

అర్హులైన తమను నేతన్న నేస్తం పథకంలో చేర్చకుండా... అనర్హులను చేర్చారంటూ చేనేత కార్మికులు పాయకరావుపేట తహసీల్దార్​ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

పాయకరావుపేటలో చేనేత కార్ముకుల ధర్నా
పాయకరావుపేటలో చేనేత కార్ముకుల ధర్నా

By

Published : Dec 30, 2019, 5:54 PM IST

నేతన్న నేస్తం పథకంలో అర్హులైన చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ... పాయకరావుపేట తహసీల్దార్​ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకంలో నిజమైన లబ్దిదారులకు జాబితాలో చోటులేదని ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గం లేని వారిని జాబితాలో అర్హులుగా చేర్చారని ఆరోపించారు. పట్టణంలో సుమారు 350 మంది చేనేత కార్మికులు ఉండగా కేవలం 50 మంది పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని... వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాయకరావుపేటలో చేనేత కార్మికుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details