వస్త్ర ప్రేమికులను ఆకట్టుకునేందుకు విశాఖలో ఆప్కో సంస్థ విక్రయాలు - ప్రదర్శన ఏర్పాటు చేసిందని ఘోష ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమలతదేవి అన్నారు. ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.
రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో... చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా రాయితీలు ప్రకటించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.