ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిజర్వ్ ఫారెస్ట్​లో పట్టాలు ఇవ్వాలని.. అర్ధ నగ్న ప్రదర్శన

అర్హులైన గిరిజనులకు రిజర్వ్ ఫారెస్ట్​లో పట్టాలు ఇవ్వకుండా మైనింగ్ మాఫియాకు ప్రాధాన్యతనిస్తూ.. రెవెన్యూ అధికారులు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని.. గిరిజన గ్రామాల ప్రజలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

Half-naked display to give tribals rails in the Reserve Forest
గిరిజనులకు రిజర్వ్ ఫారెస్ట్​లో పట్టాలు ఇవ్వాలని అర్ధ నగ్న ప్రదర్శన

By

Published : Jan 3, 2021, 9:00 PM IST

అర్హులైన గిరిజనులకు రిజర్వ్ ఫారెస్ట్​లో పట్టాలు ఇవ్వకుండా మైనింగ్ మాఫియాకు ప్రాధాన్యతనిస్తూ.. రెవెన్యూ అధికారులు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని.. గిరిజన గ్రామాల ప్రజలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ ప్రాంతంలో సామల అమ్మకొండకు ఆనుకుని ఉన్న గ్రానైట్​ నిక్షేపాలు కొంతమంది మైనింగ్ మాఫియాకు లీజు ప్రాతిపదికన కట్టబెడుతున్నారు. ఫారెస్ట్ భూముల్లో జీడీ, మామిడి తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి 80 ఎకరాల భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వకుండా.. జాప్యం చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో చాలా పర్యాయాలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు లేకపోవటంతో నిరసన కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో శ్రీకారం చుట్టామని గిరిజనులు వాపోయారు.


ఇదీ చదవండి:

విషాదం: కళ్లేదుటే తల్లిదండ్రులు మృతి.. గుక్కపట్టి ఏడ్చిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details